: విలువైన గిఫ్ట్ ఇచ్చి, అమూల్యమైన సమయం కేటాయించిన పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్: హిందీ రిపోర్టర్


‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో తొలిసారిగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాన్ని తన దైన శైలిలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బాలీవుడ్ ఫిలిం రిపోర్టర్ అనుపమ చోప్రాకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అదీ కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్లోనే. మరో హిందీ విలేకరి అజయ్ బ్రహ్మాత్మజ్ కు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మాత్మజ్ కు ఒక మంచి గిఫ్ట్ కూడా పవన్ ఇచ్చాడుట. ఆ గిఫ్టేమిటంటే, ఒక పేపర్ పై పవన్ కల్యాణ్ మూడు భాషల్లో ఆటో గ్రాఫ్ చేసి ఇచ్చారని బ్రహ్మాత్మజ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పవన్ తో ఆయన ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. పవన్ ఇంటర్వ్యూను జాగరణ్ న్యూస్ లో పబ్లిష్ చేయనున్నట్లు తెలిపారు.ఈ విలువైన గిఫ్ట్ తో పాటు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించిన పవన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ఆ ట్వీట్ లో బ్రహ్మాత్మజ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News