: ఆ రెండు క్యాచ్ లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది: ముష్రాఫె మొర్తజా
ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయిన బంగ్లాదేశ్ నిరాశలో కూరుకుపోయింది. ఎన్నో అంచనాలతో భారత్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఓటమిపాలైంది. షేన్ వాట్సన్, జాన్ హేస్టింగ్స్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేయకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేదని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రాఫె మొర్తజా పేర్కొన్నాడు. విజయానికి అవసరమైన పరుగులు చేసినప్పటికీ ఫీల్డింగ్ లో తప్పిదాలు తమ కొంపముంచాయని మొర్తజా తెలిపాడు. అయితే ఆసీస్ తో ఓటమిపాలైనప్పటికి భారత్ తో జరిగే మ్యాచ్ లో రాణించేందుకు అవసరమైన మానసిక దృఢసంకల్పం పెరిగిందని చెప్పాడు. రేపు బంగ్లాదేశ్ జట్టు టీమిండియాతో ఆడనుంది. పాక్ పై గెలిచి, భారత జట్టు మంచి జోరు మీదుండగా, రెండు మ్యాచ్ లలో ఓడి బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది.