: ఎలుకలు పట్టండి... మా ఓట్లు కొల్లగొట్టుకోండి!


‘మా ప్రాంతంలో ఉన్న ఎలుకలు పట్టండి.. మా ఓట్లు కొల్లగొట్టుకోండి’ అంటూ పశ్చిమబెంగాల్ లోని సుందర్బన్ ప్రాంత ప్రజలు అంటున్నారు. తమను ఓట్లు వేయమని అడగటానికి వచ్చిన నేతలతో ఈ ప్రాంత రైతులు ఈ కండీషన్ పెట్టారు. ఎందుకంటే, ప్రకృతి అందాలకు నెలవైన సుందర్బన్ లో ఎలుకలు విపరీతంగా ఉంటాయి. ఇక్కడికి సమీపంలోని పంట పొలాల్లోకి చేరి వరి ధాన్యాలు, బంగాళదుంపలను తినేస్తుండటంతో, తమ కష్టానికి ఫలితం దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఎలుకల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండట్లేదు. దీంతో, విసిగిపోయిన రైతులు, తమను ఓట్లు అడగడానికి వచ్చిన నేతలకు ఈ కండీషన్ పెట్టారు. కాగా, 2009లో వచ్చిన తుపాన్ కారణంగా ఈ ప్రాంతంలో పాములు అధిక సంఖ్యలో చనిపోయాయి. దీంతో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

  • Loading...

More Telugu News