: దిగ్భ్రాంతికి గురయ్యాం: బ్రిటన్ ప్రధాని కేమెరాన్


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో బాంబు పేలుళ్లు సంభవించడంపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ విచారం వ్యక్తం చేశారు. బాంబుదాడులపై సమాచారం అందగానే దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన తెలిపారు. బెల్జియంకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాగా, బ్రస్సెల్స్ లో జరిగిన బాంబుదాడుల్లో విదేశీయులెవరూ మృతి చెందలేదని బెల్జియం ప్రకటించింది. అదే సమయంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. దేశం మొత్తం హైఎలర్ట్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News