: అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు !


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనంతపురం, నందిగామలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. విజయవాడ, కర్నూలు, నంద్యాల, తిరుపతిలో 42 డిగ్రీలు, కడప, తుని, జంగమేశ్వరపురంలో 41 డిగ్రీలు, నెల్లూరు 40 డిగ్రీలు, బాపట్ల, ఒంగోలులో 39 డిగ్రీలు, మచిలీపట్నంలో 38 డిగ్రీలు, విశాఖ, కాకినాడ, కావలి, నర్సాపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా, వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉష్ణో గ్రతలు మరింత పెరిగే అవకాశముందని, సాధారణం కంటే 2,3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయన్నారు.

  • Loading...

More Telugu News