: రాజ‌కీయాల్లోకి మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్..!


స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత సినిమా రంగంపై ఆసక్తి చూపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న ఇప్పుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశాంత్‌ను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై పార్టీ శ్రీ‌శాంత్‌తో చ‌ర్చ‌లు జ‌రపగా.. తన నిర్ణ‌యం చెప్ప‌డానికి కొంత స‌మ‌యం అడిగిన‌ట్లు తెలుస్తోంది. భాజ‌పా నుంచి శ్రీ‌శాంత్ పోటీచేస్తే ఎక్సైజ్‌ మంత్రి కె.బాబుకి ప్రత్యర్థిగా త్రిపునితుర నుంచి బ‌రిలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News