: ‘చింతల’ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనుకోలేదు: మంత్రి కేటీఆర్
బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆలోచన ఉన్న వ్యక్తి అనుకున్నానని, యాంగ్రీ యంగ్ మ్యాన్ అని అనుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ‘మిషన్ భగీరథ’పై తప్పుడు ప్రచారం చేయవద్దని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని రామచంద్రారెడ్డికి అసెంబ్లీలో కేటీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో చింతల సీనియర్ నాయకుడని, ఆలోచన ఉన్న వ్యక్తి అనుకున్నాను కానీ, ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘మిషన్ భగీరథ’ టెండర్ల ప్రక్రియపై రామచంద్రారెడ్డికి అవగాహన లేదని, ఆన్ లైన్ లోనే టెండర్లు ఖరారు అవుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని, ఈ టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కేటీఆర్ అన్నారు.