: కోర్టులో న్యాయవాది ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ న్యాయవాది కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన కిశోర్ అగర్వాల్.. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పలువురు మహిళలు తమను మోసం చేశారంటూ కిశోర్ అగర్వాల్‌పై పోలీసులకి ఫిర్యాదు చేశారు. మహిళా కక్షిదారుల నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వం తరపున అన్ని పథకాలు ఇప్పిస్తానని న్యాయవాది నమ్మబలికినట్లు వారు ఆరోపించారు. దీంతో అవమానభారంతో కోర్టులో నిప్పంటించుకుని న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడి సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేయడంతో 12 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శిక్ష నుంచి తప్పించుకోవడానికే న్యాయవాది ఇలా చేశారని ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళలు ఆరోపించారు. సదరు న్యాయవాదిపై గతంలోనూ సూరత్‌లోని పలు పోలీస్‌స్టేషన్లలో ఎన్నో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.