: కరవు రహిత రాష్ట్రమే మా ఏకైక లక్ష్యం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన


ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మనుషులు చేస్తున్న పలు పొరపాట్ల వల్ల పెద్ద ఎత్తున అనర్థాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంలో నీరు లేదన్న మాటే వినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం పలు కార్యక్రమాలకు తెర లేపామన్నారు. నీటి వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఇక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నదుల అనుసంధానంలో తొలి విజయం సాధించింది తమ ప్రభుత్వమేనన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలోని మిగిలిన నదులను కూడా అనుసంధానించే కార్యక్రమాన్ని ఇకపైనా కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. రానున్న ఐదారేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమనే ఏకైక లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News