: స్వలింగ సంపర్కుల కోసం భారత్‌లో తొలి మ్యారేజ్ బ్యూరో


భారతీయ హోమోసెక్సువల్స్ కోసం అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో ఓ మ్యారేజ్ బ్యూరో ప్రారంభం కానుంది. అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బెనహర్ శామ్సన్.. స్వలింగ సంపర్కుల కోసం భారత్ లో తొలి మ్యారేజ్ బ్యూరో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాదు, డేటింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే తమ మ్యారేజ్ బ్యూరో విభిన్నంగా ఉంటుందని తెలిపారు. తమ జీవిత భాగస్వాములను వెతుక్కునేందుకు హోమోసెక్సువల్స్ పెద్ద సంఖ్యలో ఇండియాకు వస్తున్నారని, ఇలాంటి వారి కోస‌మే ఇక్క‌డ అరేంజ్ గే మ్యారేజ్ డాట్ కామ్ పేరుతో మ్యారేజ్ బ్యూరోను ప్రారంభిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సంబంధాల కోసం ఇప్పటికే 250 మంది తమను సంప్రదించారని, వీరిలో ఎక్కువ మంది భారతీయులున్నారని తెలిపారు. ఇక్క‌డి డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News