: సార్డినియాలో అత్యంత క్రమశిక్షణా యుతంగా బ్యాంకు రాబ‌రీ


ఎలాగో అలా బెదిరించి దోపిడీ చేస్తే ఏముంటుంది అనుకున్నారో ఏమో..! సినిమాల్లో క‌నిపించే దానికి మించిన ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించుకుని మ‌రీ బ్యాంకు దోపిడీ చేశారు. సైనికుల క‌వాతు ప‌ద్ధ‌తిని అనుసరిస్తూ మ‌రీ రంగంలోకి దిగారు. సార్డినియాలో అత్యంత క్రమశిక్షణా యుతంగా బ్యాంకులోకి ప్ర‌వేశించి రాబ‌రీ చేసిన ఘ‌ట‌న అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. సైనికుల పెరేడ్ సంద‌ర్భంగా మ‌న‌కు క‌నిపించే దృశ్యాన్ని.. దొంగ‌లు బ్యాంకు యాజ‌మాన్యానికి చూపించారు. అలా ఈ కొత్తరకం దొంగ‌లు క్రమశిక్షణగల సైనికుల ప‌ద్ధ‌తిని రాబ‌రీకి ఉపయోగించారు. సార్డినియాలోని ఓ బ్యాంకులోకి చొరబడిన దొంగ‌లు ఈ ప‌ద్ధ‌తితో బ్యాంకు యాజ‌మాన్యానికి ముచ్చెమ‌ట‌లు పట్టించి, దోపిడీ చేశారు. బ్యాంకులోకి ప్ర‌వేశించిన వెంట‌నే దొంగ‌లు బ్యాంకు సిబ్బంది అంద‌రితో కదిలితే కాల్చిపారేస్తామని చెప్పారు. అంతా నేలపై కదలకుండా పడుకోవాలని చెప్పారు. సిబ్బంది భ‌యంతో నేల‌పై పడుకున్నారే తప్ప ఏం చేయలేకపోయారు. దొంగలను పట్టుకునేందుకు తాజాగా పోలీసు అధికారులు ఈ వీడియోను విడుదల చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

  • Loading...

More Telugu News