: రాహుల్ గాంధీని కలసిన కన్నయ్య
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశ ద్రోహం కేసులో నిందితుడు, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ కలిశారు. లుతిన్ లోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కన్నయ్య సహా ఐదుగురు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. కాగా, బీజేపీపై పోరాటాన్ని కొనసాగించేందుకు కన్నయ్య కుమార్ మద్దతును కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో కన్నయ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం, అనంతరం ఆయన బెయిల్ పై విడుదలవడం తెలిసిందే!