: ఇరాన్‌తో అణుఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తా: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇరాన్ తో జరిగిన అణుఒప్పందంపై ఆయన స్పందించారు. వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఇరాన్ తో జరిగిన అణుఒప్పందం ఒక దురదృష్టకరం అని అన్నారు. ఈ ఒప్పందాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే విదేశాంగ విధానంలో తన తొలి ప్రాధాన్యం ఇరాన్ అణుఒప్పందం అంశమే అవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఆ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తానని అన్నారు.