: చంద్రబాబుతో జానారెడ్డి భేటీ
హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం ఓ ఆసక్తికర భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోని చంద్రబాబు చాంబర్ కు వెళ్లిన జానారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం తెలియరాలేదు.