: కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనిచేయని మాట వాస్తవమే: కేటీఆర్
కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయని మాట వాస్తవమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆ మాట వాస్తవమేనంటూ కేటీఆర్ అంగీకరించారు. మరో రెండు నెలల్లో కార్పొరేట్ ఆసుపత్రులతో సమావేశం నిర్వహించి, ఈ అంశంపై ఒక స్పష్టత ఇస్తామని చెప్పారు. హెల్త్ కార్డులు తీసుకున్న జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేశామని అన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అక్రిడేషన్ కార్డులు గురించి ఆయన ప్రస్తావించారు. హౌసింగ్ సొసైటీ కోసం రూ.2 లక్షలు కట్టిన జర్నలిస్టులకు ఆ డబ్బును రిఫండ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.