: బీజేపీకి అంత ఈజీ కాదు!: మిత్రపక్షానికి మురళీమోహన్ చురకలు
మిత్రపక్షం బీజేపీకి టాలీవుడ్ నటుడు, నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ చురకలంటించారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని ఆయన అన్నారు. అయితే, ఆ విషయం అంత ఈజీ ఏమీ కాదని కూడా ఆయన మిత్రపక్షానికి చురకలు అంటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం చెప్పడం లేదన్న మురళీమోహన్, ప్రకటనకు మరెందుకు ఆలస్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏపీతో పాటు మరో 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.