: బీర్ హాప్స్‌పై అధ్యయనం.. కేన్సర్‌కు దివ్యౌషధమంటున్న శాస్త్రవేత్తలు
బీర్ హాప్స్‌లో ఉన్న వ్యాధి నిరోధక కారకాలపై జరిపిన శాస్త్రవేత్తల అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. వర్సిటీ ఆఫ్ ఇదహో శాస్త్రవేత్త క్రిస్టోఫర్ వేనంట్ నేతృత్వంలో జరిపిన పరిశోధన వివరాల ప్రకారం.. బీరు తయారీకి వాడే ఒక రకం పువ్వులయిన బీర్ హాప్స్ లో ఉండే రసాయనాలు కేన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. కేన్సర్ నిరోధక కారకాలుండే హాప్స్‌లో హుములోనెస్, లుపులోనెస్ మిశ్రమాలను బీర్ హాప్స్ లో కనుగొన్నట్లు పేర్కొన్నారు. హాప్స్‌ను కృత్రిమంగా లేబొరేటరీల్లో తయారు చేసే దిశగా కూడా తమ అధ్యయనం కొనసాగుతుందని తెలిపారు. వీటిలోని ఆరోగ్యకారకమైన రసాయనాలతో పలు బ్యాక్టీరియాలను, ఇతర వ్యాధులను కూడా నియంత్రించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అటువంటి రసాయనాలను గుర్తించి వేరుచేయనున్నట్లు తెలిపారు.