: ‘ఇజ్రాయెల్’ ఓట్లే ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్న‌ ట్రంప్, క్లింటన్


అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ ప‌డుతోన్న డోనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఇజ్రాయెలీల ఓట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ మద్దతు పలికారు. ఇజ్రాయెల్‌ను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే రోజులు ఇక‌ అంతమవుతాయ‌ని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. మ‌రోవైపు హిల్లరీ క్లింటన్ కూడా ఇజ్రాయెలీల ఓట్లు రాబ‌ట్టేందుకు వారిని ఆక‌ట్టుకునే ప్ర‌సంగం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ కూటమిపై ట్రంప్ వైఖరిపై ఆమె విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ భద్రతపై హామీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇజ్రాయెల్‌ శాంతి చర్చల్లో తటస్థంగా ఉండాలని చెప్పి, అనంతరం ట్రంప్ మాట మార్చార‌ని హిల్లరీ క్లింటన్ విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News