: నేడు ప్రధానితో సమావేశం కానున్న మెహబూబా ముఫ్తీ
జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు జరపడానికి ఆమె సోమవారం నుంచి ఢిల్లీలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు మెహబూబా ముఫ్తీ ప్రధానితో సమావేశం జరపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా ముఫ్తీ మరికొన్ని రోజుల్లో తమ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమేర్పరచనున్నారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు, పాలనపై కట్టుబడి ఉన్నామంటూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ ముహమ్మద్ సయీద్ మృతి చెందిననాటినుంచి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది.