: ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది!...ధర రూ.26,565 మాత్రమే!


స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్... భారత్, చైనా మార్కెట్లే లక్ష్యంగా రూపొందించిన ఐఫోన్ ఎస్ఈని నిన్న రాత్రి లాంఛనంగా ఆవిష్కరించింది. ఐఫోన్లంటేనే ఖరీదైన ఫోన్లన్న భావన నుంచి భారత్, చైనా వినియోగదారులను బయటపడవేయడంతో పాటు ఆ రెండు దేశాల్లో తన మార్కెట్ ను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడమే లక్ష్యంగా యాపిల్ ఈ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ సిరీస్ లో కేవలం నాలుగు అంగుళాల డిస్ ప్లేతో రూపొందించిన ఐఫోన్ ఎస్ఈ (16జీబీ) ధర రూ.26,565గా యాపిల్ ప్రకటించింది. ఇక 64 జీబీ సామర్థ్యంతో కూడిన ఇదే ఫోన్ ధరను రూ.33,223 గా నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాపిల్ సరికొత్త ఐఫోన్ తో పాటు ఐపాడ్ ప్రో పేరిట మరో ఐపాడ్ ను కూడా విడుదల చేసింది. ఐఫోన్ ఎస్ఈ విక్రయాలు తొలుత భారత్, చైనాల్లోనే మొదలుకానున్నట్లు యాపిల్ ప్రకటించింది. దశలవారీగా దీనిని ఇతర దేశాల మార్కెట్లలోకి దించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News