: నల్లబ్యాడ్జీలతో సభలోకి ఎంటరైన వైసీపీ... బలహీన వర్గాల సంక్షేమంపై వాయిదా తీర్మానం


నిన్నటి సమావేశాలను బహిష్కరించిన ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ నేటి సమావేశాలకు హాజరైంది. పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కు సంబంధించి సర్కారు వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వరుస ఆందోళనలను కొనసాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు నేడు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సభలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఇదిలా ఉంటే... బలహీన వర్గాల సంక్షేమంపై చర్చకు అనుమతించాలని వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాల తర్వాత స్పీకర్ దీనిపై నిర్ణయం వెలువరించనున్నారు.

  • Loading...

More Telugu News