: అసెంబ్లీకి రానున్న వైసీపీ సభ్యులు... ఈ సారి నల్లబ్యాడ్జీలతో వస్తారట
తన ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన సస్పెన్షన్ వ్యవహారానికి సంబంధించి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిన్నటి సమావేశాలను బహిష్కరించిన ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ నేటి సమావేశాలకు మాత్రం హాజరు కానుంది. నిన్న విడతలవారీగా జరిగిన వైసీఎల్పీ భేటీలో భాగంగా ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరుకావాలని నిర్ణయించారు. మొన్న నల్ల రంగు చొక్కాలతో సభకు వచ్చిన వైసీపీ నేతలు... తాజాగా నల్లబ్యాడ్జీలతో రానుండటం గమనార్హం.