: రోజా సస్పెన్షన్ పై డివిజన్ బెంచ్ తీర్పు నేడే!


తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది. నిండు సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై న్యాయ పోరాటం చేసిన రోజాకు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఊరటనిచ్చింది. సెక్షన్ 340 ప్రకారం సభ్యురాలిపై ఏడాది సస్పెన్షన్ వేటు చెల్లదని చెప్పిన కోర్టు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే చట్టసభల నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించజాలవన్న ఏపీ ప్రభుత్వం రోజాను సభలో అడుగుపెట్టనివ్వలేదు. అంతేకాక సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న అటు రోజా తరఫు లాయర్ వాదనలతో పాటు ప్రభుత్వ న్యాయవాది వాదనలను డివిజన్ బెంచ్ విన్నది. దీనిపై తన నిర్ణయాన్ని కోర్టు నేడు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News