: చైనాలో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం


చైనాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా, వాతావరణం అనుకూలించకపోవడంతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా షెంజన్ విమానాశ్రయంలో 200 విమానాలను అధికారులు రద్దు చేశారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న 100 విమానాలు ఆలస్యంగా వచ్చిన కారణంగా ఎనిమిది వేలకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎయిర్ పోర్ట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News