: 'ఊపిరి' సినిమాకు స్పూర్తినిచ్చిన ఇద్దరు వ్యక్తులు బతికే ఉన్నారు: నాగార్జున
'ఊపిరి' సినిమాకు నిజజీవితంలో ఇద్దరు వ్యక్తులు స్పూర్తి అని ప్రముఖ నటుడు నాగార్జున చెప్పారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకు స్పూర్తిగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. ఈ సినిమా కథలో జీవం ఉంది కాబట్టే తాను నటించానని ఆయన చెప్పారు. కార్తీ చాలా బాగా నటించాడని, తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాడని ఆయన తెలిపారు. తమన్నా తన పాత్రలో ఒదిగిపోయిందని ఆయన పేర్కొన్నారు. కార్తీ మాట్లాడుతూ, నాగార్జునతో కలిసి పనిచేయడం అద్భుత అనుభూతినిచ్చిందని అన్నాడు. కాగా, ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.