: రాణించిన మహమదుల్లా...ఆసీస్ లక్ష్యం 157
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ చూపింది. మహమదుల్లా (49), షకిబల్ హసన్ (33) మహ్మద్ మిథున్ (23) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు 156 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా మూడు వికెట్లతో రాణించగా, షేన్ వాట్సన్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 157 పరుగుల విజయలక్ష్యంతో ఆసీస్ మరి కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.