: కోహ్లీ ఒత్తిడిలో కూడా బాగా రాణిస్తాడు!: సెహ్వాగ్


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మార్చి 23న బంగ్లాదేశ్ తో ఆడనున్న మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఢిల్లీలో సెహ్వాగ్ మాట్లాడుతూ, కోల్ కతాలోని మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ చూపిందని అన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ అద్వితీయమని చెప్పాడు. కోహ్లీ ఇన్నింగ్స్ ను తన కుమారులిద్దరూ ఆస్వాదించారని వీరూ పేర్కొన్నాడు. కోహ్లీ మంచి ప్రతిభావంతుడని చెప్పిన సెహ్వాగ్, ఒత్తిడిలో అద్భుతంగా రాణిస్తాడని కితాబునిచ్చాడు. పాక్ విజయం క్రెడిట్ కోహ్లీదేనని సెహ్వాగ్ చెప్పాడు. టీమిండియా ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియాదే విజయమని జోస్యం చెప్పాడు.

  • Loading...

More Telugu News