: హోలీ పండగ... నోరూరించే టాప్-10 స్వీట్లు!
నోరూరించే స్వీట్లు లేకుండా మన భారతీయ పండగలను ఊహించుకోలేము. పండగలకు, పబ్బాలకు కుటుంబ సభ్యులు కలుసుకోవడం శుభాకాంక్షలు చెప్పుకోవడం పరిపాటి. ఈ నెల 24వ తేదీన హోలీ పండగ రానుంది. రంగులు చల్లుకుంటూ పిల్లాపెద్దా అందరూ సంతోషంగా ఈ పండగ జరుపుకోవడం ఆనవాయతి. ఆ తర్వాత నోరు తీపి చేసుకుని సరదాగా గడపుతారు. అయితే, నోరు తీపి చేసే వాటిలో టాప్-10లో ఉన్న మన స్వీట్ల గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. గుజియా, సందేశ్, శ్రీఖండ్, రసమలై, గులాబ్ జామ్, కలాకంద్, కాజు కట్లీ, జిలేబీ, రసగుల్లా, క్యారెట్ హల్వాలు టాప్-10 స్వీట్లలో ఉన్నాయి.