: బౌండరీ లైన్ వద్ద రెండు బాల్స్... షాక్ తిన్న ఫీల్డర్లు!
టీ20 మహిళా ప్రపంచ కప్ లో, అదీ కూడా ఇటీవల జరిగిన భారత్-పాక్ మ్యాచ్ లో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. 16వ ఓవర్ లో నిదా దార్ వేసిన ఫుల్ టాస్ బాల్ ను వేదా కృష్ణమూర్తి కొట్టింది. బౌండరీ లైన్ వద్దకు చేరుకున్న ఆ బాల్ ని ఆపేందుకు ప్రయత్నించిన పాక్ ఫీల్డర్ విఫలమైంది. ఆ బాల్ ని తీసుకునేందుకని వచ్చిన ఇద్దరు ఫీల్డర్లకు అక్కడే మరో బాల్ కూడా కనిపించడంతో వారు షాక్ తిని ఆశ్చర్యపోయారు. ఆ రెండు బాల్స్ లో అసలు బాల్ ని గుర్తించి వారు బౌలర్ కు అందజేశారు. అయితే, ఈ రెండు బాల్స్ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది.