: రోజాను రాజకీయంగా ఎదుర్కోలేకే వేధింపులు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు


చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజాను ఎదుర్కోలేక టీడీపీ వ్యక్తిగత వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. లోటస్ పాండ్ లో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రోజాకు శాసనసభ ఇచ్చిన అవకాశాన్ని ఆమె వినియోగించుకుంటారని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరై తన వాదన వినిపిస్తారని వారు పేర్కొన్నారు. రోజాను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. కాగా, రేపు శాసనసభకు వైఎస్సార్సీపీ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరవుతారు.

  • Loading...

More Telugu News