: తెలంగాణ బిడ్డలు సంఘాల పేరిట విడిపోవద్దు: సీఎం కేసీఆర్


తెలంగాణ బిడ్డలు సంఘాల పేరిట విడిపోవద్దని, సమైక్యంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎంను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకర్, ట్రస్ట్ మెంబర్ లక్ష్మణ్ అనుగు కలిశారు. జులై 1 నుంచి 3వ తేదీ వరకు షికాగోలో నిర్వహించే అటా 14వ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఒక ఆహ్వాన పత్రికను అందజేశారు. 'అటా' సభలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. అమెరికాలో ఉండే తెలంగాణ ప్రజల ఆర్థిక స్థితిగతులు, ఇతర విషయాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో పట్టణాల పరిశుభ్రత, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ను, తెలంగాణ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి అటా ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News