: స్పీకర్ కు సభ నిర్వహణలో సర్వాధికారాలు ఉన్నాయి: యనమల


స్పీకర్ కు సభ నిర్వహణలో సర్వాధికారాలు ఉంటాయని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఏ రూల్ ప్రకారమైనా, స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. అయితే, రూల్స్ అనేవి ప్రాధాన్యం కాదని, సభ నిర్ణయమే కీలకమని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూల క్షమాపణలు అంగీకరిస్తున్నామన్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా కొడాలి నాని వ్యవహారంపై చర్యను సభ నిర్ణయిస్తుందని యనమల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News