: చదువులో వెనుకబడిపోయానంటూ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


తాను చదువులో వెనుకబడిపోయానని, అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదంటూ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ కు చెందిన జె.రాకేష్(20) మేడ్చల్ లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ, ఎన్ఈఎల్ శివసాయి బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే, తాను చదువులో వెనుకబడిపోయానని, తన తల్లిదండ్రులకు భారంగా మారుతున్నానంటూ ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి, తన రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వారు వెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News