: ‘డబుల్ బెడ్ రూమ్’ వివాదం, అధికారులపై మండిపడ్డ మహిళలు


డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన సర్వే నిబంధనలకు అనుగుణంగా లేదని, పేరుకు మాత్రమే ఆ సర్వే నిర్వహించారని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం మహిళలు ఆరోపిస్తూ, అధికారులపై మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం అర్హులకు ఈరోజు అధికారులు సభ నిర్వహించారు. ఈ సభ వద్దకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. వచ్చీరావడంతోనే అక్కడ ఉన్న అధికారులను ఈ విషయమై నిలదీశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో తోపులాట జరిగింది. కాగా, ‘డబుల్ బెడ్ రూమ్’ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తిరిగి సర్వే నిర్వహిస్తామని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూస్తామని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News