: విడతల వారీగా ఉద్యోగులను విజయవాడకు తరలిస్తాం: మంత్రి నారాయణ
విడతల వారీగా ఉద్యోగులు విజయవాడ వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపినట్టు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయనతో ఈరోజు ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కూడా ఉన్నారు. అనంతరం, నారాయణ మీడియాతో మాట్లాడుతూ, జూన్ 15 నాటికి నాలుగు వేల మందిని, జులైకి మరో మూడు వేల మందిని, ఆగస్టుకు మరో మూడు వేల మంది ఉద్యోగులను తరలిస్తామని ఆయన చెప్పారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించనున్నట్టు నారాయణ తెలిపారు.