: పడవలో 'పార్టీ' ప్రాణాలు తీసింది!
పార్టీలు చేసుకోవడంలో యువత వైవిధ్యం కోరుకుంటోంది. దీంతో పబ్బులు, క్లబ్బుల నుంచి బయటపడి లాంగ్ డ్రైవ్ పార్టీలు, బీచ్ ఒడ్డు పార్టీలు చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలా వైవిధ్యం కోరుకున్న పది మంది యువకులు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కమ్లాపట్ ఘాట్ వద్ద ఓ సరస్సులో పార్టీ చేసుకునేందుకు ఓ పడవను అద్దెకు తీసుకుని, సరస్సులోకి వెళ్లారు. పార్టీ ప్రారంభమయ్యింది. ఇంతలో పడవ అకస్మాత్తుగా నీటిలో బోల్తాపడింది. అంతే... పది మంది నీట్లో పడగా, వారిపై పడవ పడింది. ఈత వచ్చిన ఐదుగురు బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు మిత్రులు మాత్రం జలసమాధి అయ్యారు. అనంతరం వారి మృతదేహాలను వెలికి తీశారు. కాగా, తమ స్నేహితులు నీట్లో మునిగిపోతుంటే చూస్తుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.