: టీమిండియా విజయోత్సవం సందర్భంగా అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో అపశ్రుతి


టీమిండియా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో విజయం సాధించడంతో చేసుకున్న విజయోత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టీమిండియా విజయం సాధించడంతో యూనివర్సిటీ విద్యార్థులంతా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొందరు తుపాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ బుల్లెట్ ఓ వ్యక్తికి తగిలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని అతనిని ఆసుపత్రికి తరలించినట్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పగా, పోలీసులు భిన్నమైన కథనం చెబుతున్నారు. యూనివర్సిటీలోని రెండు గ్రూపుల మధ్య చోటుచేసుకున్న గొడవ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తమకు ఫిర్యాదు అందిందని వారు చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని వారు తెలిపారు. కాగా, గాయపడ్డ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News