: అధికారంలోకి వ‌స్తే ఒంట‌రిగానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం: స్టాలిన్


తాము అధికారంలోకి వ‌స్తే మిత్రపక్షాలకు ప్ర‌భుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పించబోమని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. తిరుచ్చి లో త‌మ పార్టీనుద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. రానున్న‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూట‌మే విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కానీ తాము ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. త‌మ‌తో మ‌రిన్ని చిన్న పార్టీలు క‌లిసే అవ‌కాశం ఉంద‌ని స్టాలిన్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అన్నాడీఎంకే పాలనలో చోటుచేసుకున్న దౌర్జన్యాలపై ప్ర‌జ‌లు త‌న‌ను ఆశ్రయిస్తున్నార‌ని ఆయన అధికార పార్టీని విమ‌ర్శించారు. అన్నాడీఎంకే మేనిఫెస్టోలో మద్యనిషేధానికి సంబంధించి హామీ వుంటుందని వార్తలు వెలువడడం బూటకమన్నారు. అయితే, తాము ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామ‌ని స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు డీఎంకేతో క‌లిసిన ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News