: అగ్రిగోల్డ్, లోకేశ్ మధ్య లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా?: లక్ష్మీపార్వతి
ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి, వారిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనుగోలు చేశారని వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ ఉదయం విజయవాడలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన ఆమె, ఈ మొత్తం కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉండబట్టే, విచారణ సక్రమంగా సాగడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను లోకేష్ కొన్నారని, సంస్థ లావాదేవీలపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? అని చంద్రబాబుకు ఆమె సవాల్ విసిరారు. ఆ సంస్థ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయకుంటే ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు.