: బహదూర్ పురాలో దారుణం!... ఫేస్ బుక్ లో పరిచయం, బలాత్కారం, ఆపై వీడియోతో బెదిరింపులు!
హైదరాబాదులోని బహదూర్ పురాలో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ దుర్మార్గుడు తనను నమ్మి తన వద్దకు వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు తన స్నేహితుడితోనూ ఆమెపై అత్యాచారం చేయించాడు. సదరు దారుణ కాండను వీడియో తీశాడు. కోరిక తీర్చుకున్న ఆ ఇద్దరు దుర్మార్గులు... ఆ తర్వాత కూడా ఆ యువతిని విడిచిపెట్టలేదు. అత్యాచారం సందర్భంగా తీసిన వీడియో పేరిట నిత్యం బెదిరింపులకు గురి చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు గుంజారు. ఇటీవల ఈ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు దుర్మార్గులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.