: బోరున విలపిస్తున్న పాక్ మోడల్... అఫ్రిది సేనపై తిట్ల దండకం!
వలువలు విప్పుతానని ప్రకటించింది. స్ట్రిప్ డ్యాన్సులు చేస్తానంది. పాక్ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదికి సదరు స్ట్రిప్ డ్యాన్స్ ను అంకితం చేస్తానంది. ఇదంతా వారం క్రితం పాకిస్థాన్ కు చెందిన మోడల్ కాందీల్ బాలోచ్ చేసిన ప్రకటన. వారం తిరిగిందో, లేదో.. ఆమె స్ట్రిప్ డ్యాన్స్ చేయలేదు కదా... బోరున విలపిస్తూ కనిపించింది. గుక్కపట్టి ఏడుస్తూనే అఫ్రిది సేనపై తిట్ల దండకం వినిపించింది. ‘లవ్ యూ’ అన్న నోటితోనే ‘హేట్ యూ’ అంటూ శాపనార్థాలు పెడుతోంది. వారం రోజుల్లో ఎంత తేడా! ఏం జరిగింది? ఐసీసీ టీ20 మెగా టోర్నీలో టీమిండియా చేతిలో పాక్ జట్టు చిత్తుగా ఓడింది. భారత్ పై గెలిస్తే... అఫ్రిది సేనకు గిఫ్ట్ గా స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని ప్రకటించిన బాలోచ్... అది జరగకపోవడంతో ఇప్పుడు బోరున విలిపిస్తోంది. అంతేకాదండోయ్... అఫ్రిదిని పొగడిన నోటితోనే అతడిపై తిట్ల దండకం అందుకుంది. నాడు వలువలు విప్పుతానంటూ హస్కీ వాయిస్ తో బాలోచ్ ప్రకటన చేసిన వీడియో... తాజాగా అఫ్రిదిని తిట్టిపోస్తూ బోరున విలపిస్తున్న వీడియోలను పక్కపక్కగా ప్లే చేస్తూ పలు న్యూస్ చానళ్లు ఆసక్తికర కథనాలను ప్రసారం చేస్తున్నాయి.