: నేడు ఢిల్లీకి మెహబూబా ముఫ్తీ... ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు
జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి గాను పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో ముఫ్తీ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మరికొంతమంది బీజేపీ నాయకులతో ఆమె సమావేశమవనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా ముఫ్తీ మరికొన్ని రోజుల్లో తమ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమేర్పరచనున్నారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు, పాలనపై కట్టుబడి ఉన్నామంటూ అరుణ్‌జైట్లీ ఇప్పటికే ప్రకటించారు.