: బాలయ్య కేసును వాదించిన లాయరే చంద్రబాబుపై పిల్ దాఖలు చేశారు!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. హైకోర్టుతో పాటు దేశంలోని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టులోనూ పలు కీలక కేసులను వాదించిన న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి ఈ పిల్ ను దాఖలు చేశారు. గోపాలకృష్ణకు సంబంధించిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే... పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. చంద్రబాబు వియ్యంకుడు, టాలీవుడ్ అగ్రనటుడు, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కేసును కూడా ఈయనే వాదించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిలపై బాలకృష్ణ తన ఇంటిలోనే కాల్పులు జరిపారంటూ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలయ్య తరఫున కళానిధే కోర్టులో వాదనలు వినిపించారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రం ‘ఖలేజా’ చిత్రం టైటిల్ కు సంబంధించిన కేసులోనూ కళానిధే వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆమ్ వే ఇండియా ఎంటర్ ప్రైజెెస్ కేసును కూడా ఆయన వాదించారు. కృష్ణా జిల్లా సింగరాయపాలెంలో జన్మించిన కళానిధి విద్యాభ్యాసం ముగిసిన తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాదులోని రామాంతపూర్ లో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

  • Loading...

More Telugu News