: హృతిక్, కంగనా వివాదంలో మరెన్నో ఆసక్తికర విషయాలు!
బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ బ్రేకప్ అవడంతో వారిద్దరి మధ్య జరిగిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితం హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' గా కామెంట్ చేయడం, దానికి హృతిక్ ఘాటుగా స్పందించడం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. కంగనా కూడా లీగల్ నోటీసులతో హృతిక్‌కు దీటుగా బదులిచ్చింది. అయితే, తాజాగా మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'క్రిష్ 3 సినిమాతో వీరిద్దరి మధ్య బంధం బలపడిన విషయం తెలిసిందే. గతంలో హృతిక్ తన భార్యకు విడాకులిచ్చి నెల రోజులయినా గడవక ముందే కంగనాకు హృతిక్ ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని హృతిక్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తెలిపారు. 2009లో 'కైట్' సినిమా సెట్స్‌పై ఉండగా వీరిరువురి మధ్య లవ్ స్టార్ట్ అయిందట. ఓ మెక్సికన్ నటితో డేటింగ్లో ఉన్న హృతిక్ ఆమెతో బ్రేకప్ అయి మరీ కంగనాతో క్లోజ్ అయిపోయాడట. హృతిక్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కంగనాతో లవ్ ఎఫైరే కారణమని అతను తెలిపారు. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగ్లో కత్రినా కైఫ్ తో హృతిక్ స్నేహం కంగనా రనౌత్ తో బ్రేకప్ అవడానికి దారి తీసిందని హృతిక్ మిత్రుడు తెలిపాడు. ఇప్పటికే వీరిద్దరి వివాదం తారస్థాయికి చేరి, బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక మున్ముందు ఈ వివాదం ఎటువంటి ట్విస్ట్లిస్తుందో చూడాలి.