: హైదరాబాద్ లో నాలుగు స్కైవేలు... ఎక్కడెక్కడో వివరించిన కేటీఆర్


హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా నాలుగు స్కైవేలను ప్రతిపాదించినట్టు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వీటి నిర్మాణంతో పాతబస్తీకి మరింత కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. మొత్తం 25 వేల కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టనున్నట్టు వివరించారు. పాతబస్తీలో రూ. 8,866 కోట్ల అంచనా వ్యయం కాగల పనులను చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ నుంచి బైరామల్ గూడ, కామినేని జంక్షన్ నుంచి చింతల్ కుంట చెక్ పోస్టు, ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ నుంచి బహదూర్ పురా జంక్షన్ వరకూ, అబీడ్స్ జీపీఓ నుంచి చాదర్ ఘాట్, మలక్ పేట, ఎల్బీ నగర్ నుంచి ఆరాంగఢ్, అఫ్జల్ గంజ్ నుంచి సెక్రటేరియట్, సిద్ది అంబర్ పేట్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకూ, ఆరాంగఢ్ నుంచి ముస్లిం జంగ్ బ్రిడ్జ్, నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకూ స్కైవేలను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మూసీ నదిపై ప్రతిపాదించిన స్కైవేకు రూ. 5,900 వ్యయం కాగలదని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ పనులన్నీ దశల వారీగా పూర్తి చేయనున్నామని, 54 జంక్షన్లను అభృవృద్ధి చేయనున్నామని, 21 పనులను ఇప్పటికే ప్రారంభించామని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News