: ఇక రాజ్ పుట్ ల వంతు!... ఓబీసీ రిజర్వేషన్ల కోసం యూపీలో ఉద్యమం


మొన్న గుజరాత్ లో పటేళ్లు, నిన్న హర్యానాలో జాట్లు, తాజాగా ఉత్తరప్రదేశ్ లో రాజ్ పుట్లు... ఓబీసీ రిజర్వేషన్ల కోసం గళమెత్తుతున్నారు. గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఆందోళనల సందర్భంగా ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదు సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న హర్యానాలో రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన జాట్లు యావత్తు దేశాన్నే వణికించారు. రోజుల తరబడి సాగిన జాట్ల ఆందోళనలో భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. తాజాగా దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన బిజ్నూర్, ముజఫర్ నగర్ ల కేంద్రంగా ‘రవా రాజ్ పుట్ సేవా సమితి’ ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 7 శాతం ఉన్న రాజ్ పుట్లు ఆర్థికంగానే కాక సామాజికంగానూ అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నారని సమితి ప్రతినిధి దేవేంద్ర కుమార్ చెప్పారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తో తమ ప్రతినిధి బృందం త్వరలో సమావేశం కానుందని, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కుమార్ చెప్పారు.

  • Loading...

More Telugu News