: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... చంద్రబాబు ఇలాకాకు చెందిన ముగ్గురు టీడీపీ నేతల దుర్మరణం


చిత్తూరు జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద బొలెరో వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, టీడీపీ నేతలు బాలకృష్ణ, సురేశ్ గా గుర్తించారు. కడప జిల్లా రాజంపేటలో నిన్న రాత్రి జరిగిన ఒ వివాహ వేడుకకు హాజరై తిరిగి శాంతిపురం వెళుతున్న క్రమంలో వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News