: అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ వైపే!... రోజాపై చర్యల విషయంలో నేడు కీలక నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ విషయంలో నేడు కీలక అడుగు పడనుంది. ఇప్పటికే ఈ విషయంపై విడతల వారీగా భేటీ నిర్వహించిన ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను నేడు అసెంబ్లీకి సమర్పించనుంది. మొన్నటి ఈ కమిటీ సమావేశానికి రోజా గైర్హాజరు కావడం, అయినా కమిటీ తన నివేదికను అసెంబ్లీకి సమర్పించేందుకు సిద్ధమైన నేపథ్యంలో విపక్ష సభ్యులపై కఠిన చర్యలు తప్పవన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు పడగా, తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)పైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.