: థియేటర్ ట్రైలర్ ను ఆవిష్కరించిన మెగాస్టార్
‘సర్దార్ గబ్బర్ సింగ్’ థియేటర్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరించే నిమిత్తం అలీ తన చేతిలోని గన్ ను మెగాస్టార్ కు అందజేశారు. అనంతరం చిరంజీవి ఆ గన్ ను పేల్చడం ద్వారా ఈ చిత్రం ట్రైలర్ ను ఆవిష్కరించారు. ‘ఒక్కడినే ఇలాగే వస్తా... పేరు గుర్తుందిగా, సర్దార్ గబ్బర్ సింగ్’ అనే పవర్ స్టార్ డైలాగ్ లు ఈ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సందర్భంగా హిందీ ట్రైలర్ ను కూడా ఆవిష్కరించారు.