: ఒక బుల్లెట్ మెగాస్టార్, మరో బుల్లెట్ పవర్ స్టార్!: అలీ చమక్కులు
పోలీసు గెటప్ లో స్టేజ్ పైకి వచ్చిన హాస్యనటుడు అలీ కడుపుబ్బ నవ్వించాడు. తన చేతిలో తుపాకీని చూపిస్తూ.. అందులో ఉన్న వాటిల్లో ఒక బుల్లెట్ మెగాస్టార్ కాగా, రెండో బుల్లెట్ పవర్ స్టార్ అని, ఆ రెండు కలిస్తే ఆరడుగుల బుల్లెట్ పవన్ కల్యాణ్ అని అలీ అన్నాడు. స్వతహాగా దర్శకత్వం చేయగల నేర్పు పవన్ కల్యాణ్ కు ఉన్నప్పటికీ, ఆ విభాగంలో తాను వేలు పెట్టకూడదని, అది డైరెక్టరే చేయాలంటూ తన గొప్పతనాన్ని చాటుకున్నారని పవర్ స్టార్ ని అలీ ప్రశంసించాడు.